KCR | నేడు రైతుల వద్దకు కేసీఆర్.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన
KCR District Tour Schedule | హైదరాబాద్ : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని తల్లడిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మస్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన నేరుగా రైతులను కలుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట(Suryapet), నల్లగొండ (Nalgonda), జనగామ(Janagama) జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి ఎండిపోయిన పంటలను స్వయంగా పరిశీలించనున్నారు.
కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదీ.KCR District Tour Schedule : ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు.
జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎం...