
Katchatheevu Island | కచ్చదీవుపై ఎందుకీ చర్చ.. ? ఈ ద్వీపం చరిత్ర ఏమిటీ?
Katchatheevu Island | 2024 లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీపై మరో వివాదం చుట్టుముట్టింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కచ్చతివు ద్వీపం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత దేశాన్ని విడదీసి, భారత్లో ఒక భాగమైన ద్వీపాన్ని.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్రీలంకకు ఇచ్చేసిందని విమర్శించారు. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఈ కచ్చతివు వివాదంపై పడింది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ కచ్చతివు ద్వీపం ఏమిటీ ..దీని పూర్వపరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
కచ్చతీవు ద్వీపం ఎక్కడ ఉంది?
కచ్చతీవు భారతదేశం- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో జనావాసాలు లేని ఒక ద్వీపం. దీని పొడవు 1.6 కిమీ కంటే ఎక్కువ ఉండదు.ఇది భారత తీరం నుండి 33 కి.మీ దూరంలో రామేశ్వరానికి ఈశాన్యంగా ఉంది. ఇది శ్రీలంక ఉత్తర కొన వద్ద జాఫ్నాకు నైరుతి దిశలో 62 కి.మీ దూరంలో ఉంది. శ్రీలంకకు చెందిన డెల్ఫ్ట్ ద...