ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి
wildlife conflict in india: దేశంలో మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. 2018 నుండి భారతదేశంలో ఏనుగులు, పులుల కారణంగా 2,950 మంది మరణించారు. ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ గురువారం రాజ్యసభలో తెలిపారు.ఈ సంఘర్షణలో మొత్తం బాధితుల్లో 90 శాతం మంది ప్రాణాలను బలిగొన్నది ఏనుగుల దాడి. 2022-23లో 605 మంది ఏనుగుల దాడులకు గురయ్యారు. 148 మరణాలతో ఒడిశాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.పులుల దాడుల విషయానికొస్తే, దేశంలో పులుల కారణంగా మరణించిన వారి సంఖ్య రెట్టింపు అయింది. 2021లో 59 మంది పులుల దాడిలో మరణించగా, 2022 నాటికి 103 మంది మరణించారని మంత్రి తెలిపారు. పులుల దాడి వల్ల అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇక్కడ 85 మంది మరణించారు.మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి వన్యప్రాణులు దాని పరిసర ప్రాంతాలలో సరళ మౌలిక సదు...