
Train Accident: పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు
Bihar train accident : బీహార్‌లో బుధవారం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (North East superfast train) పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బక్సర్ పట్ణణం సమీపంలోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు కొద్ది దూరంలో రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు(రైలు నంబర్ 12506 ) అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు వెళ్తోంది.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.రైలు ప్రమాదంలో (Train Accident) లో గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల విపత్తు నిర్వహణ శాఖ, ఆర...