Friday, March 14Thank you for visiting

Tag: congress

Rahul Gandhi : వీడిన సస్పెన్స్..  రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ

Rahul Gandhi : వీడిన సస్పెన్స్.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ

Elections
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి రెండు బలమైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఎవ‌ర‌నే దానిపై నెలరోజుల ఊహాగానాలకు ఎట్ట‌కేల‌కు ముగింపు పలికింది. రాయ్‌బరేలీ (Raebareli) నుంచి రాహుల్ గాంధీ పేరు ను పార్టీ ప్రకటించింది. అదే సమయంలో గాంధీల కుటుంబానికి మొదటి నుంచి వీరవిధేయుడైన కిషోరి లాల్ శర్మ(Kishor lal Sharma) అమేథీ (Amethi) నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ మే 3. కాగా ఈ రాయ్‌బరేలీ అమేథీలకు మే 20న 5వ దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత, రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ పార్లమెంటు సభ్యుడి ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాయ్‌బరేలీ ...
Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) త‌మ‌కు ఓటు వేయ‌కుంటే క‌రెంట్ క‌ట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ స‌ర‌ఫ‌రా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేద‌ని తన వ్యాఖ్య‌ల‌కు కట్టుబడి ఉంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ ప‌రిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగ‌కుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్‌ కట్‌ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిప‌డింది. కాం...
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Elections
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Elections
Rae Bareli : కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోట‌లుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్య‌ర్థ‌ల ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంది పార్టీ నాయ‌కత్వం. ఈ కీల‌క‌మైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా ప...
Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..

Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..

Elections
Surat Lok Sabha | 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూర‌త్ లోక్‌స‌భ (Surat Lok sabha) నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ ద‌లాళ్‌ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు పోలింగ్ అధికారి ప్ర‌క‌టించారు. ముఖేశ్ కుమార్ చంద్ర‌కాంత్ ద‌లాళ్ బీజేపీ నుంచి బ‌రిలో నిలిచారు. అయితే సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి ఆయ‌న‌ విజ‌యం సాధించార‌ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ సౌర‌భ్ పార్ది తెలిపారు. ఈమేర‌కు ద‌లాళ్‌కు ధ్రువీక‌ర‌ణ ప్ర‌త్రాన్ని కూడా అంద‌జేశారు.కాగా సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులద‌రూ పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు గుజ‌రాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు మంగ‌ళ‌వారమే చివ‌రి తేదీ. సూర‌త్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీ...
Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

National
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోట‌లా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవ‌రిని నిలుపుతుంద‌నే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవ‌రు ఉంటారు అని విలేఖ‌రులు అడుగ‌గా, "ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూ...
Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !

Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !

National
Congress candidates |వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను  విడుదల చేసింది. ఈ లిస్టులో పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, బీహర్ నాయకుడు కన్నయ్య కుమార్ పేర్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, పంజాబ్ లోని జలంధర్ (ఎస్సీ) నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు.ఫతేగఢ్ సాహిబ్ (ఎస్సీ) నుంచి అమర్ సింగ్, అమ్రుత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా,  సిద్సంగ్రూర్ నుంచి సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పాటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ,భాటిండా స్థానానికి జీత్ మొహిందర్ సింగ్, యూపీలోని అలహాబాద్ స్థానానికి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ ను పోటీలో నిలిపింది. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కోసం 75 మంది అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించింది....
Rajnath Singh | ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలపై  రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Rajnath Singh | ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

National
Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని "క్లీన్"గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. బిజెపిలో వాషింగ్ మెషీన్ లేదని, ఎవ‌రినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఏజెన్సీలకు చెప్పడం లేదని ఆయన అన్నారు. "వాషింగ్ మెషీన్ అంటూ ఏదీ లేదు, ఏజెన్సీలు తమ పనిని చేయాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఇత‌ర పార్టీలను అరెస్టు చేయాలని మేము ఏజెన్సీలకు చెబుతున్నామంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. వారు తమ తప్పులను, అవినీతిని, బలహీనతలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా అవినీతి ఆరోపణల నుండి తప్పించుకోవచ్చని వారు భావిస్తే, వారు పొరబడిన‌ట్లేన‌ని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ...
Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

National, Telangana
Congress Jana Jathara  తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు. ప్రభుత్వం మారగానే ఆ డేటాను పూర్తిగా ధ్వంసం చేశారని, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పనిచేశారో.. దిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఓ వాషింగ్ మిషన్ ఉందని, దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళలకు ఏటా లక్ష! తుక్కుగూడ (Congress Jana Jathara) సభ లో రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. అలాగే యువత...
Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..

Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..

National
Lok Sabha Elections Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 25 హామీలను వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శుక్ర‌వారం విడుదల చేశారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్‌లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామ‌ని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చింది.లోక్‌సభ ఎన్నికల 2024 న్యూస్ లైవ్: కాంగ్రెస్ శుక్రవారం తన పోల్ మేనిఫెస్టో (Congress Manifesto) ను విడుదల చేసింది, రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను ఆవ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?