Home » Rahul Gandhi : వీడిన సస్పెన్స్.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ
Congress fields Rahul Gandhi from Raebareli

Rahul Gandhi : వీడిన సస్పెన్స్.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ

Spread the love

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి రెండు బలమైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఎవ‌ర‌నే దానిపై నెలరోజుల ఊహాగానాలకు ఎట్ట‌కేల‌కు ముగింపు పలికింది. రాయ్‌బరేలీ (Raebareli) నుంచి రాహుల్ గాంధీ పేరు ను పార్టీ ప్రకటించింది. అదే సమయంలో గాంధీల కుటుంబానికి మొదటి నుంచి వీరవిధేయుడైన కిషోరి లాల్ శర్మ(Kishor lal Sharma) అమేథీ (Amethi) నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ మే 3. కాగా ఈ రాయ్‌బరేలీ అమేథీలకు మే 20న 5వ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత, రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ పార్లమెంటు సభ్యుడి ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్‌ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు .

READ MORE  Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. వివరాలు

రాహుల్ గాంధీ 2004, 2009, 2014లో వరుసగా మూడు సార్లు లోక్‌సభలో అమేథీ నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే 2019లో ఆయన తన కుటుంబానికి చెందిన ఈ సంప్రదాయ కంచుకోటలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. తదనంతరం, అతను కేరళలోని వాయనాడ్ నుంచి పార్లమెంటు దిగువ సభలో స్థానం సంపాదించారు.

రాహుల్ గాంధీ వర్సెస్ దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌

రాహుల్ గాంధీ పోటీచేస్తున్న రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్‌ ప్రతాప్‌ సింగ్ (Dinesh Pratap Singh) బలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంఎల్‌సీ అయిన దినేష్ ప్రతాప్ సింగ్ దేశ ప్రజలకు అంతగా తెలియక పోయినా యూపీ ప్రజలకు బాగా తెలుసు.. ఆయన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి అభ్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదేనంటూ దినేష్ చెబుతున్నారు. గతంలో అమేథీలో అమలు చేసిన ప్రణాళికలనే ఈసారి రాయ్‌బరేలీలోనూ అమలు చేయాలని బీజేపీ చూస్తోంది.

READ MORE  Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?

ఈరోజు కిషోరీ లాల్ శర్మతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో సోనియా గాంధీ హాజరవుతారని స‌మాచారం. ఈ రెండు నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం కారణంగా బిజెపి నుండి విమర్శలు వచ్చాయి. దాని కంచుకోటలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేకపోవడమే దీనికి కారణమని పేర్కొంది. అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి అడగ్గా, పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్ గాంధీ గత నెలలో ప్రకటించారు. సోనియా గాంధీ 2004 నుండి 2024 వరకు రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించారు, గతంలో 1999లో అమేథీలో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు .

READ MORE  Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

కాగా ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తోంది.

Congress releases another list of candidates for the upcoming #LokSabhaElections2024

Rahul Gandhi to contest from Raebareli and Kishori Lal Sharma from Amethi. pic.twitter.com/2w4QQcn9ok


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..