
India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్ కు వచ్చే సీట్లు ఇవే..
India TV poll : ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇటీవల ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బిఆర్‌ఎస్ (BRS) రెండు స్థానాలను కైవసం చేసుకోగా, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది.కాగా India TV poll ప్రకారం.. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లో బీజేపీకి చెందిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, జి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఒవైసీ హైదరాబాద్‌లో ముందంజలో ఉన్నందున, ఒపీనియన్ పోల్ ప్రకారం, ఎఐఎంఐఎం తన సాంప్రదాయ నియోజకవర్గాన్ని నిలుపుకోవచ్చు.
2019 ఎన్నికల్లో ఇలా..
2019 లోక్‌సభ...