
Subsidy Gas | 39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు
Subsidy Gas : అతి త్వరలో మరో 2 గ్యారెంటీల (Congress Guarantees)ను అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29వ తేదీన ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 39.50 లక్షల మందికి ఈ పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నారు. అయితే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రేవంత్ (Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 27 లేదా 29వ తేదీన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు గ్యాస్ డీలర్లు అందరూ సంసిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శాఖ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతి...