MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్ షాక్ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది.ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోప...