Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..
Truecaller: మనకు తెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి కాలర్ IDని గుర్తించడానికి చాలా మంది 'ట్రూకాలర్' యాప్ ను ఉపయోగిస్తుంటారు. స్పామ్ కాల్స్ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రూకాలర్ కొత్తగా పలు ఫీచర్లను జోడించింది.గూగుల్ ప్లే లేదా ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ (truecaller rebranding) ప్రకటించింది. కొత్త యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో పనిచేసే సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. లేటెస్ట్ గా మార్చిన పేరుని తక్షణమే తెలుపుతుందని పేర్కొంది.
ఈ యాప్ ఆయా నంబర్లను 3 రంగుల్లో వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పునకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత లేదా స్కామర్ కార...