Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: CM Revant Reddy

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల
Telangana

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే..మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో రాష...
Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..
Elections, Telangana

Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..

Raithu Bhandu | హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా  మే 13న జరిగే పోలింగ్ లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని భారత కూటమి అధికారంలోకి వస్తుందని, నాగేందర్‌ను కేంద్ర మంత్రిగా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  మే 9 నాటికి మిగిలిన రైతులకు రైతు బంధు (Raithu Bhandu) చెల్లింపులు పూర్తి చేస్తామని, అదే రోజున లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్లు కూడా అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు..సికింద్రాబాద్‌, కొత్తగూడెం, కొత్తకోటలో ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగిస్తూ.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, ఓఆర్‌ఆర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఫ్లైఓవర్‌లతో పాటు ఐటీ, ఫార్మా రంగాలను విస్తరించి ‘గ్లోబల్‌ సిటీ’గా మార్చాయని అన్నా...
Gas Cylinder : రూ.500ల‌కు గ్యాస్ సిలిండర్.. మొద‌ట‌ పూర్తి ధర చెల్లించాల్సిందేనా..
Telangana

Gas Cylinder : రూ.500ల‌కు గ్యాస్ సిలిండర్.. మొద‌ట‌ పూర్తి ధర చెల్లించాల్సిందేనా..

Hyderabad : తెలంగాణ ప్రభుత్వం  ఈనెల 27న మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్దమ‌వుతోంది. 'మహాలక్ష్మీ' పథకం (Mahalakshmi scheme) లో భాగంగా రేపు రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ ( Rs.500 Gas Cylinder) ను ప్రారంభించేందుకు కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ ప‌థ‌కంఓకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారులను కూడా తీసుకువచ్చింది. అలాగే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొన్ని కీలక సూచనలు చేసింది.మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు గాను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప‌లు కీల‌క అంశాల‌ను వెల్ల‌డించింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు మొద‌ట సిలిండ‌ర్‌కు సంబంధించి పూర్తి ధర చెల్లించాల్సిందేనని.. ఆ తర్వాత రూ. 500 నగదు రీయింబర్స్ మెంట్‌ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని పేర్కొంది. కాగా హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా.. ఇందులో వినియోగదారుడు చెల్లించాల్సింది రూ.500, కే...
Mahalaxmi Scheme | రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..  ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు త‌ర‌హాలో సీట్లు
Telangana

Mahalaxmi Scheme | రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..  ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు త‌ర‌హాలో సీట్లు

mahalaxmi scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ఆరు హామీల్లో భాగంగా మొట్టమొదటసారిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప‌థ‌కం కింద మహిళలందరికీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించారు. దీంతో అన్ని బస్సుల్లో ఒక్క‌సారిగా రద్దీ పెరిగింది. మహిళలందరూ ప్రైవేట్ వాహనాల‌ను వ‌దిలి బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బ‌స్సుల్లో ఎక్కువ మంది ప్ర‌యాణికులు పట్టేలా ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైళ్లలో మాదిరిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసేందుకు చ‌ర్య‌లు చేపట్టారు.Mahalaxmi Scheme  ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది జ‌ర్నీ చేయ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండు వైపులా మెట్రో రైలులో మాదిరిగా సీట్ల‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా మధ...
Maha Lakshmi scheme updates | లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘మహాలక్ష్మి’ని అమలు చేయాలి: సీఎం
Telangana

Maha Lakshmi scheme updates | లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘మహాలక్ష్మి’ని అమలు చేయాలి: సీఎం

హైదరాబాద్: దావోస్, లండన్, దుబాయ్‌లలో వారం రోజుల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల (6 guarantees ) అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సోమవారం నగరానికి తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం (praja palana) లో ఆరు హామీల పథకాలు కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పురోగతిపై నివేదికను అడిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. .Maha Lakshmi scheme updates : మూలాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే మహిళల కోసం మహాలక్ష్మి హామీ పథకంలోని మిగిలిన రెండు భాగాలను అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహాయం, అర్హులకు  రూ.500 లకు గ్యాస...
MLC Elections : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్.. మిగతా ఎవరికి చాన్స్..?
Telangana

MLC Elections : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్.. మిగతా ఎవరికి చాన్స్..?

MLC Elections 2024 : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంపై   కాంగ్రెస్ హైకమాండ్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇద్దరు గవర్నర్‌ కోటా కింద, మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోటా కింద నామినేట్‌ చేయనుండగా  జనవరి 29న పోలింగ్‌ జరగనుంది.తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గత గురువారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఎలాంటి పోటీ లేకుండా రెండు స్థానాలను సునాయాసంగా ...
‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?
National

‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ.. TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచిత సర్వీస్ అమలు అవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఆర్థికంగా తమకెంతో ప్రయోజనం కలుగుతోందని చెబుతున్నారు. అయితే, ఇదే పథకం వల్ల తాము పడరాని పట్లు పడుతున్నామని, తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.. 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా..?' అని ప్రశ్నించాడు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, ...