ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ..
TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచిత సర్వీస్ అమలు అవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఆర్థికంగా తమకెంతో ప్రయోజనం కలుగుతోందని చెబుతున్నారు. అయితే, ఇదే పథకం వల్ల తాము పడరాని పట్లు పడుతున్నామని, తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా..?’ అని ప్రశ్నించాడు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, డబ్బులు చెల్లించి మరీ తాము నిలబడి ప్రయాణించాల్సి వస్తోందని మండిపడ్డాడు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సదరు వ్యక్తి కోరాడు.
ప్రయాణికుడి ఆవేదన ఇదీ..
‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా.. డబ్బులు పెట్టి టిక్కెట్ తీసుకున్నా. అలాగే నిలబడి ప్రయాణించాలంటే మా వల్ల కావడంలేదు.. మహిళల కోసం ప్రత్యేక బస్సులైనా కేటాయించండి. లేదంటే పురుషులకు బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించండి.. లేకుంటే మరిన్ని ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేయండి. ఆర్టీసీ బస్సులో పూర్తి రద్దీ ఉంది. కనీసం 70, 80 కిలోమీటర్ల వరకు అంత దూరం నిలబడి ప్రయాణించడం ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గా రూ..!’ అంటూ ఓ వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ప్రత్యేక సీట్లు కేటాయించాలి..
TS RTC Mahalaxmi Scheme ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల్లో మగవారి కోసం ప్రత్యేక సీట్లు కేటాయించాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపాడు. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయని, పురుషులకు కనీసం నిలబడే చోటు కూడా ఉండడం లేదని పేర్కొన్నాడు. రహదారిపై బస్సు ముందు నిలబడి నిరసన తెలిపారు. పురుషులకు బస్సుల్లో కనీసం 15 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు. అతడి నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.
టికెట్ కొని బస్సులో నిలబడి ప్రయాణించాలా..??
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఆవేదనని వ్యక్తపరిచిన ప్రయాణికులు..
ఇదేం పంచాయతీ..!
మార్పు అంటే ఇదేనా ??#Telangana #Scamgress#RTCBus #Ladies #TSRTC #FreeBus #Politics#MahaLakshmiScheme #Congress #RevanthReddy… pic.twitter.com/ycemOZvrPB— AllamPavanReddy (@PavanreddyBRS) December 22, 2023
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..