- గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదు
- తెలంగాణలో కొవిడ్ చికిత్స పొందుతున్న 14 మంది
భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 358 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోవిడ్ తో ఆరుగురు మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 14 కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను మొదటిసారి కేరళలో గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కేవలం హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా నియంత్రణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ లు ధరించాలని ప్రజలకు సూచించాయి.
కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో ప్రస్తుతం 2,669 కేసులు ఉన్నాయి. జేఎన్.1 కొవిడ్ వేరియంట్ శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లతో బాధపడేవారికి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ లక్షణాలను పోలి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది తేలికపాటిదే ఐనప్పటికీ రూపం మార్చుకున్నపుడు కొత్త లక్షణాలను ప్రదర్శిస్తుందని అంటున్నారు. ఇది సాధారణ జలుబుతో ప్రారంభమైనప్పటికీ ఇది గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్నవారిలో దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
15 నెలల చిన్నారికి
Corona virus | తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కొత్తగా 6 కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 20 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 19 యాక్టివ్ కేసులుండగా (Active Cases), ఒకరు పూర్తిగా కోలుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని నిలోఫర్ ఆస్పత్రిలో (Nilophar Hospital) తొలి కరోనా కేసు నమోదైంది. ఐదు రోజుల క్రితం నాంపల్లి ఆగాపురకు చెందిన 15 నెలల చిన్నారికి తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండగా చిన్నారిని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగైందని, వెంటిలేటర్ తొలగించి ఆక్సిజన్ సాయంతో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి శ్రీనివాస్ కల్యాణి వెల్లడించారు. కొవిడ్ కొత్త వేరియంట్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఎవరికి ప్రమాదం.. లక్షణాలు ఏంటీ..?
Corona virus కొత్త వేరియంట్ ను తేలికగా తీసుకోవద్దని, వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. గతంలో కొవిడ్ ను అరికట్టడానికి వ్యాక్సిన్ సహాయపడినా.. కొత్త వేరియంట్ భిన్నంగా ఉండడం.. ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ జేఎన్.1 ను జన్యు శాస్త్రం ప్రకారం సాల్టేషన్ ఈవెంట్ అంటారు.. జ్వరం, దగ్గు, రుచి కోల్పోవడం, వాసన గుర్తించకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, తినలేకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భారత్ లో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ గడ్డు పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతస్థాయిలో సమీక్షలు నిర్వహించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించింది. రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. మందులు, ఆక్సిజన్ సిలిండర్లు తగినంత నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చండీగఢ్ లో ఇప్పటికే మాస్కులు ధరించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు చేతులను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..