Hyderabad : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 27న మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ‘మహాలక్ష్మీ’ పథకం (Mahalakshmi scheme) లో భాగంగా రేపు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ( Rs.500 Gas Cylinder) ను ప్రారంభించేందుకు కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ పథకంఓకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారులను కూడా తీసుకువచ్చింది. అలాగే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొన్ని కీలక సూచనలు చేసింది.
మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు గాను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పలు కీలక అంశాలను వెల్లడించింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు మొదట సిలిండర్‌కు సంబంధించి పూర్తి ధర చెల్లించాల్సిందేనని.. ఆ తర్వాత రూ. 500 నగదు రీయింబర్స్ మెంట్ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని పేర్కొంది. కాగా హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా.. ఇందులో వినియోగదారుడు చెల్లించాల్సింది రూ.500, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రూ. 40 పోగా మిగతా డబ్బులు రూ. 415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు సమాచారం..
హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ధర రూ.955 కాగా, , మహబూబ్‌నగర్‌లో రూ. 958.50గా ఉంది. ఇలా రాష్ట్రంలోని ప్రతీ నగరం, పట్టణం, గ్రామం.. ఏ చోటైనా సిలిండర్ ఛార్జీల్లో స్వల్పంగా తేడాలు ఉంటాయి. రవాణా ఛార్జీల్లో తేడాలే ఇందుకు కారణం. ఇక రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వీరందరిని కూడా మహాలక్ష్మీ పథకంలోకి చేర్చింది. వీరికి కేంద్రం నుంచి ప్రతీ సిలిండర్‌కు రూ.340 రాయితీ లభిస్తోంది. ఈ రాయితీ పోనూ.. మిగతా మొత్తం, అదనంగా రవాణా ఛార్జీలు సైతం పడకుండా.. ఆ డబ్బునంతా ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహణకు గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు గ్యాస్‌కు చెల్లించాల్సింది రూ.500, ఇక మిగిలిన దానిలో కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ. 340 వస్తే.. మిగతా రూ. 115ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా చెల్లించనుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..