Home » Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌
Longest Cable Stayed Bridge

Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Spread the love

Sudarshan Setu | దేశంలోనే అత్యంత‌ పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్‌ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గ‌ల ఈ వంతెన పొడ‌వు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్‌ ద్వారకా (Beyt Dwarka)తో క‌లుపుతుంది.

2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల ఖ‌ర్చుతో దీన్ని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పు, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పు గ‌ల‌ ఫుట్‌పాత్‌లు సైతం ఉన్నాయి. సుదర్శన్‌ సేతు ను ఒక విల‌క్ష‌ణ‌మైన‌ డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జికి ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను ఆక‌ట్టుకుంటాయి.

READ MORE  టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

Longest Cable Stayed Bridge ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

  • సిగ్నేచర్ బ్రిడ్జ్ ఒక ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది, ఇందులో భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్‌పాత్.. రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలను కలిగి ఉంది. ఇది భారతదేశంలోని అతి పొడవైన తీగల వంతెనగా గుర్తింపు పొందింది, ఫుట్‌పాత్‌లోని ఎగువ భాగాలలో సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. వీటి నుంచి ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • 2.5 కి.మీ వంతెన ₹ 978 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది ప్ర‌ముఖ ఆధ్యాత్మిక కేంద్ర‌మైన ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం నిర్మించారు.
  • ఈ వంతెన గుజరాత్‌లోని ఓఖా నుంచి బేట్ ద్వారకను కలుపుతుంది.
  • బేట్ ద్వారక అనేది ద్వారకా పట్టణం నుండి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఓఖా నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపం, ఇక్కడ శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీష్ ఆలయం ఉంది.
  • గతంలో ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’గా పిలిచే ఈ వంతెనకు ‘సుదర్శన్ సేతు’ లేదా సుదర్శన్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు.
  • ఓఖా – బెట్ ద్వారక మధ్య ప్రయాణించే భక్తులకు ర‌వాణా సౌక‌ర్యాన్ని సుల‌భ‌త‌రం చేస్తుంది. దీని నిర్మాణానికి ముందు యాత్రికులు ద్వారకలోని బేట్‌లోని ద్వారకాధీష్ ఆలయానికి చేరుకోవడానికి పడవల‌పై ప్ర‌యాణించి వెళ్లాల్సి వ‌చ్చేంది.

 

READ MORE  Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..