Rainfall | తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్..
Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సోమవారం ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రుతు పవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు రుతుపవనాలు వ్యాపించాయి.నైరుతి రుతుపవనాల వ్యాప్తితో తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో వానలు కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall ) జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలం...