
పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం.కొన్ని దశాబ్దాల క్రితం వినాయక విగ్రహాలను మట్టి (బంక మట్టి), గడ్డిని వంటి సహజమైన వనరులతో తయారు చేసేవారు. ఆ తర్వాత విగ్రహాన్ని పసుపు వంటి సహజ, సేంద్రియ రంగులతో అలంకరించేవారు కానీ కానీ ప్రస్తుతం POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), థర్మకోల్, ప్లాస్టిక్ వంటి మట్టిలో కలిసిపోని, నీటిలో కరిగిపోని పదార్థాలతో విగ్రహాలను అత్యంత అందంగా రూపొందిస్తున్నారు. కంటికి ఇంపుగా...