Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్
Chikkamagaluru : కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండా (Palestinian Flag ) లతో వాహనాలపై ర్యాలీలు చేస్తూ హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నలుగురు మైనర్లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ల చేతికి జెండా ఎలా వచ్చింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా అలా చేయమని ప్రోత్సహించారానే కోణంలో దర్యాప్తు చేపట్టారు.ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి పాలస్తీనా జెండా పట్టుకుని కనిపించడంతో స్థానిక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భజరంగ్‌దళ్, భాజపా కార్యకర్తలు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగి నిందితులను వెంటన...