Tantalum | సట్లెజ్‌లో కనిపించిన అరుదైన లోహం టాంటాలమ్ అంటే ఏమిటి?
టాంటాలమ్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు కనుగొన్నారు..దాని లక్షణాలు ఏమిటి?
Tantalum : పంజాబ్‌లోని సట్లెజ్ నది ఇసుకలో అరుదైన లోహం టాంటాలమ్ ఉన్నట్లు రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం కనుగొంది. ఇన్స్టిట్యూట్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెస్మి సెబాస్టియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణను చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ఈ లోహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ టాంటాలమ్ నిల్వలు గుర్తించడం పంజాబ్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది.
టాంటాలమ్ అంటే ఏమిటి?
టాంటాలమ్ పరమాణు సంఖ్య 73 కలిగిన అరుదైన లోహం. ఇది బూడిద రంగులో ఉంటుది. ఇది బరువైనది, చాలా గట్టిది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అత్యంత తుప్పు-నిరోధక లోహాలలో ఒకటి. ఇది అధిక తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది గాలిలో ఉంచినప్పుడు ఇది ఆ...