Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్‌లు.. పలువురు మృతి
Dibrugarh-Chandigarh Express | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్‌ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15904) పట్టాలు తప్పి (Train Accident ) అనేక కోచ్‌లు పడిపోయాయి. రైలు దిబ్రూగఢ్‌కు వెళ్తుండగా జిలాహి రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో నాలుగు ఏసీలతో సహా రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్‌ను ఘటనాస్థలికి పంపారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక పరిపాలనకు సహాయం చేయడానికి ఆర్మీ సిబ్బందిని పంపించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోవాలని అధికారులను ఆ...