Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్‌లు.. పలువురు మృతి
Dibrugarh-Chandigarh Express | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్‌ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15904) పట్టాలు తప్పి (Train Accident ) అనేక కోచ్‌లు పడిపోయాయి. రైలు దిబ్రూగఢ్‌కు వెళ్తుండగా జిలాహి రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో నాలుగు ఏసీలతో సహా రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్‌ను ఘటనాస్థలికి పంపారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక పరిపాలనకు సహాయం చేయడానికి ఆర్మీ సిబ్బందిని పంపించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గాయపడిన వారికి సకాలంలో వైద్యం కూడా అందించాలని ఆయన ఆదేశించారు.
Another train mishap….Dibrugarh Express (going from Chandigarh to Dibrugarh) somewhere between Gonda and Basti in Uttar Pradesh… pic.twitter.com/T4yiiH8FZ3
— NIVEDITA SINGH (@niveditasingh__) July 18, 2024
కాగా, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ఒక నెల తర్వాత తాజాగా డిబ్రూఘర్‌లో రైలు పట్టాలు తప్పింది, జూన్ 17న డార్జిలింగ్ లో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం(Train Accident )లో 10 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ రైలు అగర్తలా నుంచి సీల్దా కు వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు లోకో పైలట్, ఇద్దరు అదనపు రైల్వే సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..