Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA) అధికార ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెం...