BRS Manifesto | బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్
BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని.. భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరాలు ఇవీ..
రైతుబంధు 16 వేలకు పెంపు
తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఏడాది రూ.12వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత ప్రతీ సంవత...