Rythu Runa Mafi | రుణమాఫీకి ఆ కార్డు అవసరం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..
Rythu Runa Mafi | గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోమారు స్పష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్రక్రియను ప్రభుత్వం ఇదివరకే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమని తేల్చి చెప్పారు. కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉచిత బస్సు పథకంపై ఆసక్తిక...