Thursday, April 3Welcome to Vandebhaarath

Tag: Breaking news

Twitter Down | ఒక్క రోజులోనే  X (Twitter) రెండుసార్లు డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు
Technology

Twitter Down | ఒక్క రోజులోనే X (Twitter) రెండుసార్లు డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు

Breaking News Twitter Down : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) ఒక రోజులోనే రెండు సార్లు డౌన్ అయింది. దీని వల్ల వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. మార్చి 10, 2025 నాటికి, 40,000 కంటే ఎక్కువ సేవా అంతరాయాలు నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది అమెరికా, భారత్, UK, ఆస్ట్రేలియా, కెనడాలోని వెబ్, మొబైల్ యాప్‌లలో వినియోగదారులను ప్రభావితం చేసింది.Twitter Down : ప్రపంచవ్యాప్తంగా అంతరాయండౌన్‌డెటెక్టర్ ప్రకారం, IST సాయంత్రం 7:00 గంటల ప్రాంతంలో అంతరాయం మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుంది, ఇది ఒక్క రోజులోనే రెండవ పెద్ద అంతరాయంగా గుర్తించబడిందని నివేదికలు సూచిస్తున్నాయి:56 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు.33 శాతం మంది వెబ్‌సైట్‌లో సమస్యలను నివేదించారు.11 శాతం మంది సర్వర్ కనెక్షన్ లోపాలను ఎదుర్కొన్నారు.IST మధ్యాహ్నం 3:20 గంటలకు అంతకుముందు అంతరాయ...
అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి
తాజా వార్తలు

అయోధ్య‌ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి

Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం క‌న్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు.మహంత్ సత్యేంద్ర దాస్‌(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు.Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్ర‌Ram Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Templ...
FCI : ఎఫ్‌సీఐ బియ్యం ధర క్వింటాల్‌కు రూ.550 తగ్గించిన కేంద్రం
National

FCI : ఎఫ్‌సీఐ బియ్యం ధర క్వింటాల్‌కు రూ.550 తగ్గించిన కేంద్రం

New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్‌కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్‌కు రూ. 2,250గా నిర్ణయించిన కొత్త ధర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇథనాల్ తయారీదారులకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇథనాల్ (Ethanol) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు..సవరించిన ధర ఇథనాల్ ఉత్పత్తి ప్రోత్స‌హించ‌డంతోపాటు వివిధ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల కోసం బియ్యం లభ్యతను పెంచుతుంద‌ని కేంద్రం పేర్కొంది. ఈ చొరవ బియ్యం మార్కెట్లను స్థిరీకరించడానికి జీవ ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి దోహ‌దం చేయ‌నుంది.కొత్త స‌వ‌రించిన ధ‌ర‌ల వ‌ల్ల స్టాక్ స్థాయిలను నిర్వహించడానికి, సరఫరా గొలుసు ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఇంధన భద్రతను ...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం
National

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు.నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Pushpa 2 star Allu Arjun arrested : అర్జున్‌పై నమోదైన అభియోగాలు ఏమిటి?
Entertainment

Pushpa 2 star Allu Arjun arrested : అర్జున్‌పై నమోదైన అభియోగాలు ఏమిటి?

Allu Arjun arrested : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (Pushpa 2) ఒక‌వైపు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ రికార్డులను బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. మ‌రోవైపు పుష్ప 2 స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) పై ఇటు అరెస్టు కావ‌డం తెలుగు రాష్ట్రాల‌తోపాటు అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో సంచ‌ల‌నంగా మారింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేట‌ర్‌లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ ఈవెంట్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో దుర‌దృష్ట‌వ‌శాత్తు ఓ మహిళ మృతిచెంద‌గా ఓ బాలుడు తీవ్రంగా గాయాల‌పాల‌య్యాడు. ఈ కేసులో తెలుగు నటుడు అరెస్టయ్యాడు.ఏం జరిగింది, ఆరోపణలు ఏమిటి?శుక్రవారం అల్లు అర్జున్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన నివాసం నుంచి చిక్క‌డ ప‌ల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 105, 118(1) కింద అల్లు అర్జున్‌, అతని భద...
RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు
Crime

RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు

RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్ర‌మంగా త‌న‌ను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. "వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం హత్య) చేసి నన్ను ఇరికించాడని చెప్పాడు.ఈ కేసులో ఈరోజు విచారణ ప్రారంభం కావడంతో సంజ‌య్‌ రాయ్‌ను సీల్డే కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా ,సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచార‌ణ‌లు జరిగాయి. ఈసంద‌ర్భంగా రాయ్‌ను మధ్యాహ్నం కోర్టుకు తీసుకువచ్చారు.భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు శిక్ష), 103 (హత్యకు శిక్ష)...
Jharkhand Election | కుల గ‌ణ‌న‌పై యూపీ సీఎం సంచ‌న‌ల వ్యాఖ్య‌లు..
Elections

Jharkhand Election | కుల గ‌ణ‌న‌పై యూపీ సీఎం సంచ‌న‌ల వ్యాఖ్య‌లు..

Jharkhand Election | భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం హజారీబాగ్ చేరుకున్నారు. బర్కాగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బర్కాగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడుతూ కులాలవారీగా విడిపోవద్దని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాళ్లు రువ్వేవారిని శక్తిమంతులుగా మార్చవ‌ద్ద‌ని హితువు ప‌లికారు. అంద‌రూ ఐక్యంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి, మీరు ఎప్పుడైతే కులం పేరుతో విడిపోతారో.. మీరు ప‌త‌నానికి నాంది ప‌లుకుతార‌ని హెచ్చ‌రించారు. అదే జ‌రిగితే.. ఇళ్ల‌లో గంట‌లు మోగించ‌లేం.. విభజన జరిగితే భవిష్యత్తులో తమ ఇళ్లలో గంటలు, శంఖాలు మోగించలేమని బర్కాగావ్ అసెంబ్లీ ప్రజలకు ...
DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..
తాజా వార్తలు

DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..

DA Hike : దీపావళి పండుగకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అంతకంటే ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi Govt) కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు తీపిక‌బురు చెప్పింది. మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (dearness allowance) ను 3 శాతం పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలైలో ఏడాదికి రెండుసార్లు డీఏను అంచనా వేసి, సర్దుబాటు చేసి, ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. చివరిసారి, మార్చిలో 4 శాతం ప్రకటించగా ఇది జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది. దాదాపు 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ల‌బ్ధి ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 50 శాతం డీఏకు అర్హులు కాగా, పెన్షనర్లు తమ ప్రాథమిక పెన్షన్...
West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా
Crime

West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్‌ వైద్యుల రాజీనామా

Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హ‌త్య‌ ఘటనలో షాకింగ్ ప‌రిణామాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార‌ దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్క‌సారిగా రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది.కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ కళాశాల హాస్పిట‌ల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్ట‌ర్ ...
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?
తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు క...