
Boat Wave Sigma 3 | తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్
Boat Wave Sigma 3 | బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ భారత్ లో లాంచ్ అయింది. ఇది స్మార్ట్‌వాచ్ క్రెస్ట్+ OSలో నడుస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్,, SpO2, డైయిలీ యాక్టివిటీ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. మ్యాప్ మై ఇండియా నావిగేషన్‌కు కూడా ఈ వాచ్ సపోర్ట్ ఇస్తుంది. గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో బోట్ వేవ్ సిగ్మా 3 ధర
Boat Wave Sigma 3 Price : బోట్ వేవ్ సిగ్మా 3 భారతదేశంలో రూ. 1,199 ధరలో అందుబాటులో ఉంది. ఇది బోట్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా వంటి ఆన్ లైన్ ఈకామర్స్ వెబ్ సైట్లతోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఏడు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్లాక్, మెటల్ గ్రే, కూల్ గ్రే, చెర్రీ ...