BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..
BJP on Reservation | అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల (Reservation) ను పునర్విభజన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని బీజేపీ తన తాజా ప్రకటన ద్వారా బహిర్గతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ, చివరి దశకు దేశం సిద్ధమవుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం #MeraVoteMeraAdhikar అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. అందులో రిజర్వేషన్ల పునర్విభజనపై కాంగ్రెస్ ఉద్దేశాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించింది. 'మైనారిటీ' వర్గాలను సంతృప్తి పరచడానికి మన దళిత, గిరిజన, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను తగ్గించిన విషయాన్ని ఆ ప్రకటనలో ప్రస్తావించింది. .BJP on Reservation : 48 సెకన్ల నిడివి గల వీడియోలో, SC/ST/OBC రిజర్వేషన్ల గురించి అట్టడుగు వర్గాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మాస్ హిస్టీరియా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా మార్చి...