Bharat Rice |భారత్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేటర్ పరిధిలోని 24 ప్రాంతాల్లో విక్రయాలు..
Bharat Rice | పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్ రైస్ (Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) (NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్ వంటి సంస్థలు ఈ భారత్ రైస్ ను విక్రయించాలన కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్ ద్వా రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్ రైస్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత 15 రోజులుగా విక్రయాలు కొనసాగుతున్నాయని నాఫెడ్ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా భారత్ రైస్ పై తగినంత ప్రచారం లేకపోవడంతో 15రోజులుగా అమ్మకాలు...