ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..
ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన
అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైనా తమకు ఇష్టమైన సినిమాలను చూడటానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar), హులు(Hulu) వంటివి చాలా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ అప్లికేషన్‌లన్నింటినీ ఉపయోగించడానికి, మీరు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు, మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా సినిమాలను స్ట్రీమింగ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లు చాలానే ఉన్నాయని మీకు
తెలుసా..? పైగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదీ కూడా చట్టవిరుద్ధం కాదు. మీరు రిజిస్ట్రేషన్ లేకు...