Posted in

ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..

Best movie streaming sites free 2023
Free movie streaming sites
Spread the love

ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన
అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైనా తమకు ఇష్టమైన సినిమాలను చూడటానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar), హులు(Hulu) వంటివి చాలా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ అప్లికేషన్‌లన్నింటినీ ఉపయోగించడానికి, మీరు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు, మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా సినిమాలను స్ట్రీమింగ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లు చాలానే ఉన్నాయని మీకు
తెలుసా..? పైగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదీ కూడా చట్టవిరుద్ధం కాదు. మీరు రిజిస్ట్రేషన్ లేకుండానే సినిమాలను స్ట్రీమ్ చేయగల ఉత్తమ ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌ల జాబితాను ఇక్కడ చూడండి.

Best movie streaming sites free 2023

ప్లెక్స్ (Plex)

ఈ యాప్ దాదాపు ఏదైనా మీడియా పరికరానికి అనుకూలంగా ఉంటుంది. ఉచితంగా సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ఇది వెబ్ షోలు, వార్తలు,  పాడ్‌కాస్ట్‌లను ప్రసారం చేస్తుంది. ఇందులో వార్నర్ బ్రదర్స్, MGM వంటి ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో సహా 20,000 కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న సినిమాలను  చూవచ్చు. 130కి పైగా ఛానెల్‌లను ప్రసారం చేస్తూ, ఇది మీకు పూర్తి టీవీ వీక్షణ అనుభవాన్ని కూడా అందిస్తుంది. మీకు ఇష్టమైన అన్నిసినిమాలు, టీవీ షోలతో ప్లే లిస్ట్ ను కూడా సృష్టించవచ్చు. స్ట్రీమింగ్ ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా  అకౌంట్ ను లింక్ చేసుకోవాలి. లోపం. ఒకసారి లింక్ చేసిన తర్వాత, ప్లెక్స్ పాస్‌కి అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

123Movies

12మువీస్ ఈ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత మూవీ-స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లలో ఒకటి. మూవీస్, టైమ్‌లెస్ క్లాసిక్‌ల కలెక్షన్స్ ఇందులో ఉన్నాయి. అందువల్ల మీకు అవసరమైన వాటిని ఇక్కడ పొందవచ్చు. అది కూడా ఉచితంగా.. కంటెంట్ స్ట్రీమింగ్ కోసం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్ అంతరాలు లేని వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. హోమ్‌పేజీకి సెర్చ్ బార్, కేటగిరీ ఆప్షన్ ఉన్నందున వెబ్‌సైట్ సింపుల్ లేఅవుట్‌ను కలిగి ఉంది. కొన్నిసార్లు వీడియోను ప్రారంభించడానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్లే బటన్‌ను నొక్కాల్సి రావచ్చు, వీడియోల నాణ్యత కూడా బాగానే ఉంది.

జియో సినిమా (Jio Cinema)

జియో సినిమాకు పరిచయం అక్కర్లేదు. సరికొత్త OTT ప్లాట్‌ఫారమ్ విస్తృతమైన కంటెంట్‌ను ఉచితంగా అందిస్తూ OTT ప్రపంచంలో పెను సంచలం సృష్టించింది. అన్ని జియో సినిమా ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లు ఉచితంగా లభిస్తాయి. చలనచిత్రాలు ,ఎపిసోడ్‌ల మధ్య ప్రకటనలు ఉన్నప్పటికీ, మీరు ఎటువంటి సమస్యలు లేకుండా అధిక నాణ్యతతో చాలా కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. ప్రస్తుతం జియో సినిమాలో లైవ్ స్పోర్ట్స్ కూడా ఉచితం.

క్రంచైరోల్ (Crunchyroll )

ఇది యానిమేషన్ చిత్రాలు ఇష్టపడేవారు. తప్పనిసరిగా దీన్ని ఒకసారి ట్రై చేయవచ్చు. క్లాసిక్‌లు, లేటెస్ట్ రిలీజ్ సహా విస్తృతమైన జపనీస్ అనిమేషన్
చలనచిత్రాలు, TV సిరీస్‌లను అందిస్తోంది. Crunchyroll ఉచితం అయితే, ప్రీమియం సర్వీస్ నెలకు `79 కి అందుబాటులో ఉంది. ఇది కొత్త షోలకు ముందస్తు యాక్సెస్, ప్రకటన ఫ్రీ ఎక్స్ ప్రీయన్స్, మల్టీ స్క్రీన్‌లకు సపోర్ట్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌ల వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది Android,
iOS, Xbox, PlayStation, Chromecast, Apple TV, Roku, Amazon Fire TVలో అందుబాటులో ఉంటుంది.

రకుటెన్ వికీ (Rakuten Viki)

ఇది కొరియన్ -డ్రామాకు సంబంధించి ఇది అత్యంత పాపులర్ అయిన స్ట్రీమింగ్ యాప్. ఇది క్లాసిక్, లేటెస్ట్ కంటెంట్‌ను కోరుకునే అన్ని వర్గాల ప్రేక్షకులకు సరిపడా కంటెంట్ ను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇంగ్లీషు తోపాటు స్పానిష్, ఫ్రెంచ్‌, హిందీ, తెలుగుసహా అనేక ఇతర భాషల్లో సబ్ టైటిల్స్ ప్లే అవుతాయి. కొరియన్ షోలు, చలనచిత్రాలకే పరిమితం కాకుండా చైనీస్, తైవానీస్, జపనీస్ సినిమాలు, వెబ్ సిరిస్ లను ఇందులో చూడొచ్చు. ఇక ఇందులో తరచూ ప్లే అయ్యే యాడ్స్ వినియోగదారులకు కొంత చికాకు తెప్పించొచ్చు.

MX Player

MX Player అనేది సబ్‌స్క్రిప్షన్ కోసం ఏమీ చెల్లించకుండానే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్, మ్యూజిక్ అందించే ఆకర్షణీయమైన వెబ్‌సైట్. హిందీ, తెలుగు, తమిళం, భోజ్‌పురి, మలయాళంలో అత్యధిక రేటింగ్ పొందిన సినిమాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌లో యాక్షన్, రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్ మరెన్నోజానర్ సినిమాలు టీవీ షోలు దీనిలో అందుబాటులో ఉన్నాయి.

Roku Channel

ప్రధానంగా ఇది దీని స్ట్రీమింగ్ పరికరాలకు ప్రసిద్ధి చెందిందిన అమెరికన్ కంపెనీ. Roku, ఉచిత కంటెంట్‌తో నిండిన మూవీ ఛానెల్‌ని అందిస్తుంది. ఇది
350కి పైగా లైవ్ ఛానెల్‌లను కలిగి ఉంది. సినిమాల నుండి వార్తల వరకు ప్రతిదీ ప్రసారం చేస్తుంది. ముఖ్యంగా, దీన్ని యాక్సెస్ చేయడానికి ఒకరికి
Roku డివైజ్ అవసరం లేదు. ఇది Android, iOS, స్ట్రీమింగ్ బాక్స్‌లు, స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంది.

Mzzalo

ఇది భారతీయ చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌ల విస్తృతమైన కంటెంట్ ను అందిస్తుంది. లైవ్ TV యాక్సెస్‌తో పాటు హై-డెఫినిషన్ నాణ్యతతో స్ట్రీమింగ్
చేస్తుంది. ఈ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ ఇటీవలి, పాతకాలపు ఫిల్మ్‌లు, గేమ్‌లు, టీవీ షోలు, సెలబ్రిటీ మూమెంట్‌లు, యూజర్ రూపొందించిన స్పోర్ట్స్ కంటెంట్
మ్యూజిక్ వీడియోలను అందిస్తుంది, ఇది iOS Android రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

Pikashow

ఆండ్రాయిడ్- ఫోన్లలో వాడుకోవడానికి Pikashow అనుకూలంగా ఉంటుంది. ఇది APK ఫార్మాట్లో అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఇష్టమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ప్రాంతీయ చిత్రాలను వీక్షించవచ్చు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు బాలీవుడ్, హాలీవుడ్ లేదా లైవ్ టీవీ కంటెంట్ నుండి ఎంచుకోగలిగే చక్కటి వ్యవస్థీకృత ప్లాట్‌ఫారమ్‌ను ఇది అందిస్తుంది. ఇది విభిన్న ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ అందిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రకటనలు(యాడ్స్) వస్తూ కొంత చికాకు కలిగించవచ్చు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *