Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు
Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వరలో వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసందర్భంగా వైష్ణవ్ తెలిపారు. "వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోసమానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది.వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుత...