Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వ‌ర‌లో వందేభార‌త్ స్లీప‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసంద‌ర్భంగా వైష్ణవ్ తెలిపారు. “వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోస‌మానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్‌ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది.

వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. “వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రజల ప్రయాణ విధానాన్ని మారుస్తుంది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ఇది రాత్రిపూట 800-1,200 కి.మీ దూరం ప్రయాణించడానికి అనువైనదని అన్నారు.

రైలు సిబ్బందికి ప్ర‌త్యేక బెర్త్‌లు

రైల్లో ట్రైన్ అటెండెంట్లకు ప్రత్యేక బెర్త్‌లను ఏర్పాటు చేశారు. “రైలు అటెండెంట్ల కోసం ప్రత్యేక బెర్త్ ఉంటుంది కాబట్టి వారు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. లోకో పైలట్ క్యాబిన్ కూడా ఎయిర్ కండిషన్ చేశారు. అంతేకాకుండా ప్రత్యేక టాయిలెట్‌తో ఉంటుంది.

READ MORE  Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు...

వందే భారత్ స్లీపర్ రైలులో వైరస్ నియంత్రణ యంత్రాంగాలు, కుదుపులు, శబ్దం, వైబ్రేష‌న్స్ లేకుండా సాఫీగా ప్ర‌యాణిస్తాయి. వందే స్లీపర్, వందే చైర్ కార్, వందే మెట్రో, అమృత్ భారత్ రైళ్లు: “మా కొత్త కాన్ఫిగరేషన్‌ల కోసం ప్రయాణికులు, సిబ్బంది ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం తుది మెరుగులు దిద్దిన‌ట్లు అశ్వ‌నీ వైష్ణ‌వ్ తెలిపారు.

మే 2023లో, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) BEML లిమిటెడ్‌తో 16 కార్ల వందే భారత్ స్లీపర్ రైలు సెట్‌ల 10 రేక్‌ల తయారీకి ఆర్డర్ చేసింది. ఇది గరిష్టంగా 160 kmph (180 kmph) వేగంతో దూసుకెళ్తుంది. 16 కోచ్‌లు కలిగిన వందే భారత్ స్లీపర్ రైలులో 11 3ఏసీ కోచ్‌లు (611 బెర్త్‌లు), 4 2ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), 1 1ఏసీ కోచ్ (24 బెర్త్‌లు) సహా మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి.

BEML త్వరలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి మొదటి రైలును పంపుతుంది. ICF రేక్ ఫార్మేషన్, ఫైనల్ టెస్టింగ్ నిర్వహిస్తుంది. దీనికి దాదాపు 15-20 రోజులు పడుతుంది. దీని తరువాత, రైలు ట్రయల్స్‌తో సహా మెయిన్‌లైన్ పరీక్షలు నిర్వ‌హిస్తారు. ఇది లక్నోకు చెందిన రైల్వే డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో ఒకటి లేదా రెండు నెలల పాటు కొనసాగుతుంది. హైస్పీడ్ టెస్టింగ్ కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది.

READ MORE  Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

విమానంలో మాదిరి ప్రయాణం..

వందే భారత్ స్లీపర్ రైలులో విమానంలో ఉండే అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి స్లీపర్ బెర్త్‌లో రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ సాకెట్లు, మొబైల్/మ్యాగజైన్ హోల్డర్, స్నాక్ టేబుల్ ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫ‌స్ట్ క్లాస్‌ ఏసీ ప్రయాణికులకు వేడి నీటి స్నానం వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇది డ్రైవింగ్ ట్రైలర్ కోచ్ (DTC)లో డాగ్ బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో ప్రయాణికులు లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి చెందిన పెట్ డాగ్స్ ను ఉంచవ‌చ్చు. రాత్రిపూట వాష్‌రూమ్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం నిచ్చెనల కింద ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ప్యాంట్రీ కారులో, ఓవెన్‌లు, బాటిల్ కూలర్‌లు, డెజర్ట్‌ల కోసం కంపార్ట్‌మెంట్‌లు, బాయిలర్‌లు అలాగే కాంపాక్ట్ డస్ట్‌బిన్‌లు ఉన్నాయి.

“ట్రైన్‌సెట్ ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రయాణికుల భద్రతను పెంచడానికి ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ బఫర్‌లు, కప్లర్‌ల వంటి అధునాతన క్రాష్‌వర్తీ ఎలిమెంట్స్ తో అమర్చబడి ఉంటుంది. రైలుసెట్‌లో ఉపయోగించే అన్ని పదార్థాలు భాగాలు అత్యున్నత ఫైర్ రెసిస్టెంట్ ను క‌లిగి ఉంటాయి.

READ MORE  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..

“ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యున్నతమైన ఇంటీరియర్స్‌తో రూపొందించబడిన వందే భారత్ స్లీపర్ రైలు సెట్ భారతదేశం రైలు సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని ప్ర‌తిబింబిస్తుంది. ఇది యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా ప్రయాణీకులకు అనుభవాన్ని అందిస్తుంది. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ సుదూర రైలు ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నారు. సౌకర్యం, భద్రత సమర్థత కోసం భారతదేశం కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది” అని BEML CMD శంతను రాయ్ అన్నారు.

విక‌లాంగుల‌కు స‌దుపాయాలు

” Vande Bharat sleeper ట్రయిన్‌లో యుఎస్‌బి ఛార్జింగ్ సదుపాయం, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, డిస్‌ప్లే ప్యానెల్‌లు, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు, వికలాంగుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, టాయిలెట్‌లతో సహా ప్రపంచ స్థాయి ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణీకులు, రైలు భద్రత కోసం కవాచ్ సదుపాయం అదనంగా క‌ల్పించారు. 1వ ఏసీ కారులో వేడినీటితో కూడిన షవర్లు అందుబాటులో ఉన్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *