పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?
Pager | బీరుట్: లెబనాన్‌లో టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పేజర్లు పేలిపోవడంతో తొమ్మిది మంది మరణించగా, 2,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు (సాయంత్రం 6 గంటలకు IST) పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, దాదాపు 2,800 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు.
పేజర్లు అంటే ఏమిటి?
పేజర్ లేదా 'బీపర్' అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా సంక్షిప్త సందేశాలను స్వీకరించే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు పేజర్లను విస్తృతంగా ఉపయోగించేవారు ముఖ్యంగా వైద్యులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, యూత్ కోసం అప్పట్లో ఇది అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ సాధ...