Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..
Adani Group | షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం (Bangladesh Crisis) తీవ్రమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఇటీవల రుణాల కోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో పాటు పలు చోట్ల తలుపులు తట్టారు. ఇప్పుడు అతడి ముందు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా బిల్లును చెల్లించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దాదాపు 500 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేసింది.
గత ప్రభుత్వ ఒప్పందాలపై విమర్శలు..
అదానీ గ్రూప్ తన 1600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు మహ్మద్ యూనస్ దీనిని చాలా ఖరీదైన ఒప్పందం అని పిలవడం ప్రారంభించాడు. ఈ డీల్‌లో కూడా పారదర్శకత పాటించలేదని, షేక్ హ...