
Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘర్షణల మధ్య గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. ఖుల్నా డివిజన్‌లోని మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అక్కడి నుంచి పరారైన తర్వాత ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్, ఇస్కాన్ దేవాలయాలలో ఒకదానిని ధ్వంసం చేసి, తగులబెట్టినట్లు తెలిపారు. “నాకు అందిన సమాచారం ప్రకారం, మెహర్‌పూర్‌లోని మా ఇస్కాన్ సెంటర్‌లలో ఒకటి (అద్దెకి తీసుకున్నది) జగన్నాథుడు, బలదేవ్, సుభద్రా దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి తగులబెట్టారు అని తెలిపారు. ఆ ఆలయంలో తలదాచుకున్న ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు ” అని గోవింద చెప్పారు.
ప్రధాని హసీనా అధికారం నుంచి వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. “చిట్టగాంగ్‌లోని మూడు దేవాలయాలు ముప్పులో ఉన్నాయి, అయితే హిందూ సమాజం, కొంతమంది ముస్లిం సమాజంలోని సభ్యులు వాటిని ఇప్పటివరకు రక్షించినట్లు చెబుతున్నారు. చిట్టగాంగ్‌లోని పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సహాయం కోసం అధికారులు అభ్యర్థించినప్పటికీ సమాధానం ఇవ్వలేదని ఇస్కాన్ ప్రతినిధి పేర్కొన్నారు. “చాలా మంది హిందువులు ఇతర మైనారిటీలు భయాందోళనల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోజులను గడుపుతున్నట్లు తెలుస్తోంది. కొందరు పశ్చిమ బెంగాల్, త్రిపుర మీదుగా భారతదేశానికి పారిపోతున్నారు
బంగ్లాదేశ్ సంక్షోభం: దేవాలయాలపై దాడి
Bangladesh Crisis : మతపరమైన ప్రదేశాల కంటే, ఢాకాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం – భారతదేశం-బంగ్లాదేశ్ సాంస్కృతిక వారధికి బలమైన చిహ్నంగా ఉన్న ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్‌లో కొంతమంది వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారులు అక్కడితో ఆగలేదు. వారు రాజధాని వీధుల్లోకి వచ్చారు. ప్రముఖ ప్రదేశాలను తగులబెట్టారు. అటువంటి ప్రదేశం బంగబంధు భాబన్, దేశ పితామహుడిగా పిలవబడే షేక్ హసీనా తండ్రి మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
సివిల్ సర్వీస్ కోటా వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేస్తూ మొదలైన ఉద్యమం క్రమంగా రూపం మార్చుకుంది. నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు, అవామీ లీగ్ పార్టీ సానుభూతిపరులు అనేక మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒత్తిడితో షేక్ హసీనా నిశ్శబ్దంగా పదవీ విరమణ చేసి సోమవారం బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. ఈ క్రమంలో శాంతిని స్థిరీకరించడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు హింసను ఆపాలని ఆందోళనకారులను వేడుకున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..