Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి
Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా పిలిచే తన ప్రతిష్టాత్మకమైన ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ దాదాపుగా పూర్తికావచ్చింది. రెండు ప్రధాన కారిడార్లతో 44.65 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.బెంగళూరు మెట్రో రూ.15,611 కోట్ల ఫేజ్-3 ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-3 లో రెండు ఎలివేటెడ్ కారిడార్లతో మొత్తం 31 మెట్రో స్టేషన్లతో 44.65 కి.మీ మేర విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం వేచి ఉంది.మొదటి కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుకు పశ్చిమ వైపున 32.15 కి.మీ.కు పైగా విస్తరించి, JP నగర్ నాల్గవ దశను కెంపపురాని...