Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియన్ రైల్వే..
Rail Network : రైల్వే ట్రాక్ విస్తరణలో భారతీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విషయమై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు ముకుల్ శరణ్ మాథుర్ మాట్లాడారు. రైలు విద్యుదీకరణ (Track Electrification)లో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశ రైలు నెట్‌వర్క్ ఇప్పుడు 68,000 కి.మీ విస్తరించి ఉందని, మరింత విస్తరణకు సిద్ధంగా ఉందని మాథుర్ ఉద్ఘాటించారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోందని, వలస కార్మికులకు సహాయంగా ఇటీవల 5,000 ప్రత్యేక రైళ్లను నడిపిందని ఆయన గుర్తుచేశారు. భారతదేశ రైలు ఆధునికీకరించే యత్నాల్లో భాగంగా వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టామని ప్రస్తుతం అవి విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.
టికెట్ వాపస్
2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వే విస్తరణ కోసం భారత ప్రభుత్వం రూ.85,000 కోట్లు కేటాయించి...