Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన "చేదు అవమానం" కారణంగా JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత చంపాయ్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు."ఢిల్లీ, కోల్‌కతాలో జార్ఖండ్ ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన తర్వాత, బిజెపిలో చేరాలనే నా సంకల్పం బలపడింది" అని ఆయన అన్నారు. గిరిజనుల ప్రగతిని కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించిన సోరెన్, "ప్రజలకు న్యాయం చేసేందుకు తానుకట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. "నేను నా చెమట, రక్తంతో JMM ను పోషించాను, కానీ ఎన్నో అవమానాలకు గురయ్యాను. అందుకే నేను బిజెపిలో చ...