Wednesday, June 18Thank you for visiting

ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి 

Spread the love

టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా
చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది.  అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్‌ లో
వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో ఇప్పుడు
చూద్దాం..

Rice

Rice – అన్నం

సమయాభావం వల్ల తరచుగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. అన్నం వండడానికి కుక్కర్‌ని ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరైతే, మళ్లీ ఈ తప్పు చేయకండి. ఇది
బియ్యంలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి హానికరమైన యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో చేసిన అన్నం మీకు హానికరం
కావొచ్చు. బియ్యాన్ని ఉడికించడానికి పాన్ లేదా గిన్నెలను ఉపయోగించవచ్చు. మట్టికుండలైతే మరీ మంచింది.

Vegetables

Vegetables – కూరగాయలు

కూరగాయలలో ఖనిజాలు, విటమిన్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రెజర్ కుక్కర్‌లో వండినప్పుడు కొంతవరకు నాశనం కావచ్చు. అందుకే చాలా కూరగాయలు ముఖ్యంగా పచ్చి ఆకు కూరలను పాన్ లేదా కడాయిలో వండాలని నిపుణులు సూచిస్తున్నారు.

pastha

Pasta – పాస్తా

మీరు పాస్తాను ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టినా, అది ఆరోగ్యానికి అది హానికరం కావొచ్చు. మీరు దానిని పాన్లో ఉడకబెట్టడం బెటర్. పాస్తాలో పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల
హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది.

Fish in bowl

Fish – చేపలు

ప్రెషర్ కుక్కర్‌లో చేపలను కూడా వండొద్దు. చేప చాలా మృదువుగా ఉంటుంది. కుక్కర్లో ఉడికిస్తే.. మరీ ఎక్కువ ఉడికిపోయే అవకాశం ఉంది. దీనివల్ల చేపలు రుచి మొత్తం పోతుంది.

potato
Photo : pexels-polina-tankilevitch

Potato – బంగాళాదుంప

బంగాళాదుంపను ఆహారంలో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీనిని ఉడికించడానికి ఎక్కువగా ప్రెషర్ కుక్కర్ ను ఉపయోగిస్తారు. అయితే బియ్యంలో మాదిరిగా బంగాళదుంపలు కూడా చాలా పిండి పదార్ధాలు ఉంటాయి. ఈ ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టడం మంచిది కాదు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..