Pradhan Mantri Suryodaya Yojana : పేద మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. “ప్రధానమంత్రి సూర్యోదయ యోజన” (Pradhanmantri Suryoday Yojana) పేరుతో సరికొత్త స్కీమ్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీని కింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని భక్తులు అందరూ నిరంతరం సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు.. ఈరోజు, అయోధ్యలో పవిత్ర కార్యక్రమం తర్వాత దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ పవర్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలని నా సంకల్పం మరింత బలపడింది. అని అన్నారు.
అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత నేను తీసుకున్న తొలి నిర్ణయం ఇదే.. ‘మా ప్రభుత్వం దేశంలోని ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ని ప్రారంభించనుంది.. ఇది పేద, మధ్య తరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా నిలుపుతుంది.’ అని నరేంద్ర మోదీ ఎక్స్ లో వెల్లడించారు.
రూఫ్ టాప్ సోలార్లు తక్కువే..
భారత దేశంలో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు ఇంకా ఊపందుకోని సమయంలో ఈ పథకం రావడం చాలా గొప్ప విషయం. 2022 చివరి నాటికి 40 గిగావాట్లు చేరుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా అది సాధ్యం కాలేదు. ఇప్పటివరకు కేవలం 5.87 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులను మాత్రమే ఏర్పాటు చేశారని.. ఇది ఆశించిన లక్ష్యంలో 15% కంటే తక్కువని.. గత సంవత్సరం మేలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ వెల్లడించింది.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
Pradhan Mantri Suryodaya Yojana news : ప్రస్తుతం గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యం 72.31 గిగావాట్లలో 11.08 గిగావాట్లు ఉన్నట్లు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఎనర్జీ ట్రాన్సీషన్ ప్లాన్ ప్రకారం.. 2030 నాటికి మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 500 గిగావాట్లలో, సౌర విద్యుత్ 292 గిగావాట్లు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ తాజా పరిణామంపై సోలార్ స్క్వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రేయా మిశ్రా మాట్లాడుతూ.. “నేడు, భారతదేశంలో 1% కంటే తక్కువ ఇళ్లలో సోలార్ పవర్ ఉంది. కానీ ఇది త్వరలో మారబోతోంది. సోలార్‌తో ”ఎనర్జీ ఇండిపెండెంట్”గా మారడానికి వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంది. హోమ్ సోలార్ అడాప్షన్‌లో జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి అధునాతన రెసిడెన్షియ ల్ సోలార్ మార్కెట్ల సరసన భారత్ కూడా త్వరలో చేరుతుంది.” అని అభిప్రాయపడ్డారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..