Sunday, April 27Thank you for visiting

Nutrition Food | మీరు తినే ఆహారంలో ఏయే పోష‌కాలు ఉన్నాయో ఈ యాప్ తో తెలుసుకోవ‌చ్చు..

Spread the love

nutriAIDE : మీరు తింటున్న ఆహారంలో పోషకాలు ఏమున్నాయి.. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ల‌భించే శ‌క్తి ఎంత ఉంటుంది.. ఒంటికి కావాల్సిన ఖనిజపోష‌కాలు ఈ ఆహారం వ‌ల్ల లభిస్తుందా అనే పూర్తి వివ‌రాలు మ‌నలో చాలా మందికి తెలియ‌వు. అయితే వీట‌న్నింటికి సంబంధించిన స‌మాచారాన్ని అందించే యాప్ ఒక‌టి అందుబాటులోకి వ‌చ్చింది. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) కొత్త‌ న్యూట్రీఎయిడ్ (nutriAIDE) యాప్ ను విడుద‌ల చేసింది. ఇండో-జర్మన్ పరస్పర సహకారంతో రెండేళ్ల పాటు శాస్త్రవేత్తలు ప‌లు పరిశోధనలు చేసి దీనిని అభివృద్ధి చేశారని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్ట‌ర్ హేమలత వెల్ల‌డించారు. తార్నాకలోని ఎన్ఐఏన్ లో జర్మన్ శాస్త్రవేత్తలతో కలిసి గురువారం దీనిని ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో మనం రోజూ తీసు కునే ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెర శాతాల వివరాలు తెలుస్తాయని వివ‌రించారు. ఈ యాప్ కు సంబంధించిన పూర్తి స‌మాచారం nutriaide.org వెబ్ సైట్ నుంచి తెలుసుకోవ‌చ్చ‌ని సూచించారు.

READ MORE  Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై... ఇక లోక్ సభ బరిలోకి సై..

5,500 రకాల ఆహార సమాచారం..

భారత్ లోని 5,500 రకాల ఆహార ప‌దార్థాల‌కు (Nutrition Food) సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ వివ‌రిస్తుంద‌ని డాక్ట‌ర్‌ హేమలత తెలిపారు. ప్యాకెట్లలో లభించే ఆహార ప‌దార్థాల్లో 12 శాతం వరకూ దీనికి అనుసంధానం చేశామన్నారు. శారీరక శ్రమ, వయస్సుల ఆధారంగా ఎంత తినాలి అనేది అంచనా వేయవచ్చని తెలిపారు. ఆహారంలోని పోషకాల గురించి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించడం ఈ యాప్ ముఖ్య ల‌క్ష్య‌మ‌ని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డా. సుబ్బారావు ఎం గవరవరప అన్నారు.

READ MORE  Dates Benefits : రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..