
భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు
వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆలయంలో ఆదివారం ఏకాదశి (Ekadashi ) పూజలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మహిళలు నిమిషాంబ దేవి అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకులు లక్ష్మీనరసింహ చార్యులు, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కె. సురేష్ అధ్యక్షులు, వెంకటేశ్వర్ వర్మ, సంతోష్ బాబు, విజయరాజ్, సునీల్ కుమార్, సంజయ్ కుమార్, రమేష్, రాందాస్, వెంకటేశ్వర్లు, సుగుణాకర్ తోపాటు స్థానిక కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కళ్యాణి, శోభారాణి, కావిక, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నిమిషాంబ దేవి ఆలయంలో ఆదివారం ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. #Warangal pic.twitter.com/Tw64RJocmt
— Vande Bhaarath🚩 (@harithamithra1) July 6, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.