18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన
హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్వీప్ ఓటరు నమోదు, ఓటు హక్కు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఓటురుగా నమోదైన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక కాంపెయిన్లో భాగంగా ఈ నెల 26 , 27వ తేదీల్లో అలాగే వచ్చే నెల 2, 3వ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని, అర్హులందరూ స్థానిక బీఎల్ఓ లేదా voters.eci.gov.in వెబ్ సైట్ ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా ఫారం-6 దరఖాస్తు ను పూర్తి చేసి నమోదు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.
అదే విధంగా ఓటరు జాబితాలో సవరణలు ఉంటే ఫారం 8 ను నింపి సవరణలు చేసుకోవాలని తెలిపారు. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్న యువత ఆన్ లైన్ లో దరఖాస్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఓటరు నమోదుకు సంబంధించి సమస్యలు, సలహాలు ఉంటే తమకు తెలపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువతకు ఈవీఏంల పై ఓటు వేయించి అవగాహన కల్పించారు. జిల్లాలో చేపడుతున్న ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమాలను ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా జిల్లా యంత్రాంగం ప్రచారం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా, పరిశ్రమల శాఖ జీఎం హరిప్రసాద్, జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.