Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో ” నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ “ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ చేయడానికి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు.. గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ప్రస్తుతానికి మేము పది మంది మృతదేహాలను వెలికితీశాము.” అని పేర్కొన్నారు.
మదురై (Madurai) రైల్వే స్టేషన్‌కు 1 కిలోమీటరు దూరంలో రైలు ఆగి ఉంది. ప్రయాణికులు మీనాక్షి ఆలయం దర్శనం కోసం బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు మదురై రైలు స్టేషన్‌కు వచ్చేసరికి, అప్పటికే చాలా మంది ప్రయాణికులు దిగిపోయారు.
“ఇది నాగర్‌కోయిల్ జంక్షన్‌లో నిన్న (ఆగస్టు 25) రైలు నెం. 16730 (పునలూర్-మధురై ఎక్స్‌ప్రెస్)లో అటాచ్ చేయబడిన ప్రైవేట్ పార్టీ కోచ్. పార్టీ కోచ్ వేరు చేయబడి మధురై స్టాబ్లింగ్ లైన్‌లో ఉంచబడింది. ప్రైవేట్ పార్టీ కోచ్‌లోని ప్రయాణికులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ రైల్వే ప్రకటించింది.
పార్టీ కోచ్ ఆగస్టు 17న లక్నో నుంచి ప్రయాణాన్ని ప్రారంభించారని, ఆదివారం చెన్నైకి తిరిగి వచ్చి అక్కడి నుంచి లక్నోకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారని పేర్కొంది.
కాగా డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM), అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ADRM) సహా రైల్వే అధికారులు, ఇతర డివిజనల్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.