
ఒడిశాలో మృత్యుఘోష
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు
278కి చేరిన మృతుల సంఖ్య
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది గాయపడ్డారు. 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అని అధికారులు శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కటక్‌లోని ఆసుపత్రులలో గాయపడిన వారిని పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం పెనువిషాదాన్ని నింపింది.ఈ ప్రమాదంలో ఒక రైలు మరొకదానిపైకి బలంగా ఢీకొట్టింది. తద్వారా బోగీలు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆపై ట్రాక్‌లు మెలితిప్పినట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా తెగిపోయిన ...