
Raksha Bandhan 2023 : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత
Rakhi Festival : రక్షా బంధన్, లేదా రాఖీ పర్వదినం తోబుట్టువుల మధ్య అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ ఏటా శ్రావణ మాసంలో పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) రోజున వస్తుంది. ఈ పర్వదినాన సోదరులు, సోదరీమణులు ప్రత్యేక పూజలు చేసి సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి, వారి నుదుటిపై తిలకం వేసి, వారి శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు అన్ని కాలాల్లో రక్షణగా నిలుస్తారని భావిస్తారు. వారికి కానుకలను అందజేస్తారు. అయితే ఇటీవల కాలంలో సోదరీమణులు కూడా ఒకరికొకరు మణికట్టుకు రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు.
రక్షాబంధన్ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30 లేదా 31?
What Is Rakhi Festival: దేశ ప్రజలు రాఖీ పర్వదినాన్ని జరుపునే సమయం ఆసన్నమైంది. అయితే ఈ సంవత్సరం రాఖీ రోజున తోబుట్టువులంతా వారి అన్నాదముళ్లకు ఎలాంటి రాఖీలు కట్టాలనే విషయమై పలు రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. కానీ ఈసారి రక్షబంధన్ విషయంలో ఓ చి...