Home » Sam Pitroda Quits Congress : జాత్యహంకార వ్యాఖ్యలతో దుమారం.. కాంగ్రెస్ కు శామ్ పిట్రోడా రాజీనామా
Sam Pitroda Quits Congress

Sam Pitroda Quits Congress : జాత్యహంకార వ్యాఖ్యలతో దుమారం.. కాంగ్రెస్ కు శామ్ పిట్రోడా రాజీనామా

Spread the love

Sam Pitroda Quits Congress | లోక్ సభ ఎన్నికల సమయంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు, పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా ఈ సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలను జాత్యహంకారమని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలు, ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలోనే శ్యామ్ పిట్రోడా గురించి పార్టీ కమ్యూనికేషన్స్-ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ X లో ఒక కీలకమైన పోస్ట్ చేశారు.

READ MORE  Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..

” శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు” అని పోస్ట్‌లో ఉంది. కాగా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పిట్రోడా భారతదేశాన్ని విభిన్న దేశంగా అభివర్ణించారు, ఇక్కడ తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమాన ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు, ఉత్తరాన ఉన్నవారు శ్వేతజాతీయులుగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రిన్ల మాదిరిగా కనిపిస్తారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

READ MORE  Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామ‌న్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు..!

ఈనేపథ్యంలోనే జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్ప‌దం కావ‌డంతో శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. కాగా కొద్దిరోజుల క్రితం వారసత్వ పన్నుపై పిట్రోడా చేసిన వ్యాఖ్యపై ఇప్పటికీ నిప్పులు చెరుగుతూనే ఉంది. అయితే శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంది. “భారతదేశ వైవిధ్యాన్ని వివరించడానికి శ్రీ సామ్ పిట్రోడా చెప్పిన సారూప్యతలు అత్యంత దురదృష్టకరం.. అవి ఆమోదయోగ్యం కాదు. ” అని పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


 

READ MORE  New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..