Medicines Price Reduced : మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 మందుల ధరల కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మధుమేహం, బాడీ పెయిన్, లివర్ సమస్యలు, యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన మందులు, ఫార్ములేషన్‌ల ధరలను తగ్గించినట్లు పేర్కొంది.
వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే అందజేయాలని ఫార్మా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్‌పిపిఎ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఔషధాల ధరల తగ్గింపుతో దేశంలో సుమారు 10 కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని కేంద్రం అంచానా వేసింది. గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..