Friday, April 25Thank you for visiting

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Spread the love

Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణానికి అనుకూలమైన వాగులుగా మారుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా వర్షాకాల భయాలు, కష్టాలు దూరం కావడం లేదు.

READ MORE  Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..

పెరిగిపోతున్న ‘నాలా’ మరణాలు

గత మంగళవారం ప్రగతినగర్ వద్ద బహిరంగ నాలాలో పడి నాలుగేళ్ల మిథున్ రెడ్డి మృతి చెందింది. అయితే ఈ మరణం ఒక్కటేమీ కాదు. సెప్టెంబర్ 26, 2019న చైతన్యపురి వద్ద స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు పూజారులు మ్యాన్‌హోల్‌లోకి జారి పడిపోయారు. వారిలో ఒకరు బయటకు రాగలిగారు కాని మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

సెప్టెంబర్ 17, 2020 న, సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఓపెన్ నాలాలో పడి సుమేధా కపురియా అనే 12 ఏళ్ల బాలిక మరణించింది. 2020 నవంబర్‌లో గడ్డి అన్నారం వద్ద ఉదయం నడకకు వెళ్లిన సరోజ అనే 80 ఏళ్ల వృద్ధురాలు తెరిచి ఉన్న నాలాలోకి జారిపోయింది.

READ MORE  Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు

జూన్ 6, 2021 న, ఆనంద్ సాయి అనే ఎనిమిదేళ్ల బాలుడు బోనెపల్లిలో ఓపెన్ నాలాలోకి పడి మరణించాడు. సెప్టెంబరు 2021లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మణికొండ వద్ద ఉన్న నాలాలో జారిపడి మరణించాడు. 2023 ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో మౌనిక అనే పదేళ్ల బాలిక నాలాలోకి జారిపడి ప్రాణాలు విడిచిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.

భారతదేశంలోని 53 నగరాల్లో పాదచారులకు ముప్పుగా పరిణమిస్తూ మన హైదరాబాద్  ఏడవ స్థానాన్ని మూటగట్టుకుంది. నడిచేవారికి అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌కు  గుర్తింపు వచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2021లో, హైదరాబాద్‌లో 97 పాదచారులు మరణించారు. 597 మందికి పైగా గాయపడ్డారు.

READ MORE  రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

Green Mobility, సోలార్, పర్యావరణానికి  సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..