Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మహిళల లీలలు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ((Free Bus For Woman) ) .. చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా మారింది. బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెగిరిపోయింది. 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో టిజి ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు చేస్తున్న పిచ్చిపనులు ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గుర్తిచేస్తున్నాయి. సీటు కోసం మహిళలు కొట్టుకోవడం తరచూ చూస్తున్నాం. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే మహిళలతోపాటు పురుషులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు
Free Bus For Woman అయితే ఎలాగూ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని కొదరు మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు ఎక్కేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా దానికి ఉదాహరణగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. టీజీఎస్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న ఒక మహిళ.. తాపీగా బ్రష్ చేస్తూ కనిపించింది. ఇంటి వద్ద టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకునుకుందో ఏమో.. మరి! బస్సు కిటికీ వద్ద కూర్చుని పళ్లు తోముకుంటూ కనిపించింది.
మరొక వీడియోలో కొందరు మహిళలు ఆర్టీసీ బస్సు సీటులో కూర్చుని ఎల్లిపాయల పొట్టు తీస్తూ ఉన్న వీడియో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎక్కూవగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం (mahalakshmi-scheme) కింద TGRTC బస్సుల్లో మహిళలందరికీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది , అయితే కొంతమంది మహిళలు దీనిని తమ ఇల్లుగా ఉపయోగిస్తున్నారు. ఇద్దరు మహిళలు అందులో వెల్లుల్లి పొట్టు తీయడం పీల్చడం కనిపించింది. మరో మహిళ ఇప్పుడు బస్సులో పళ్ళు తోముకుంటోంది అని రాశారు..
#Telangana govt provides #FreeBus travel to all women in RTC buses under #MahalakshmiScheme, but some women are using it as their home.
Two women were seen Peeling off Garlic in the @TGSRTCHQ bus, now a woman is seen brushing her teeth in the #TGSRTC bus, in the #ViralVideos . pic.twitter.com/oAX5bgotaE
— Surya Reddy (@jsuryareddy) July 28, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..